calender_icon.png 18 October, 2024 | 5:52 PM

అక్టోబర్‌లో రానున్న ‘షణ్ముఖ’

27-07-2024 12:20:23 AM

ఆదిసాయికుమార్, అవికాగోర్ జంటగా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వంలో సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ రూపొందించిన ఈ సినిమాకు తులసీరాం సాప్పని,  షణ్ముగం సాప్పని, రమేశ్ యాదవ్ నిర్మాతలు. ఈ మూవీలో ఆది సాయికుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుపుకొంటోంది. ఈ పాన్ ఇండియా డివోషనల్ థ్రిల్లర్‌ను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నామని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు.

ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని వారు చెప్పారు. ఆది కెరీర్‌లో ఈ సినిమా మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు సంగీత సారథ్యం వహించిన రవి బస్రూర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.