calender_icon.png 20 November, 2024 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్‌లో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు!

20-11-2024 12:02:25 AM

ఓపెనింగ్ రోజే సీజ్ 

గాంధీనగర్, నవంబర్ 19: ఆస్పత్రి ప్రచారం కోసం పంపిణీ చేసిన కరపత్రాలే ఫేక్ డాక్టర్లను పట్టించాయి. గుజరాత్‌లోని సూరత్‌లో ఆదివారం జరిగిన ఈ ఘటన అక్కడి వైద్యాధికారుల వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. ఐదుగురు ఫేక్ డాక్టర్ ఫ్రెండ్స్ కలిసి పండేసర్‌లో ‘జనసేవ’ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆదివారం ప్రారంభించారు. అయితే ఆస్పత్రి ప్రారం భో త్సవం సందర్భంగా ప్రచారం కోసం భారీస్థాయిలో కరపత్రాలు పంపిణీ చేశారు.

కరపత్రాల్లో తాము చదువుకున్న మెడికల్ ఎడ్యుకేషన్ అర్హతల ను పేర్కొన్నారు. అయితే వారి విద్యార్హతలపై కొందరికి అనుమానం రావడంతో అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వారి మెడికల్ సర్టిఫికెట్స్‌ను చెక్ చేయడంతో వారిలో ఇద్దరి సర్టిఫికెట్స్ ఫేక్ అని తేలాయి. అలాగే మిగతా వారి పత్రాలను చెక్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో హాస్పిటల్‌ను అధికారులు సీజ్ చేశారు. ప్రారంభించిన కొద్ది గంటల సమయంలోనే తిరిగి హాస్పిటల్‌ను మూసివేశారు.