calender_icon.png 1 October, 2024 | 4:59 AM

శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు!

01-10-2024 12:24:49 AM

పట్టాలుండవు.. పరిజ్ఞానమూ లేదు 

అర్హతకు మించి వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలు

రోగుల ప్రాణాలు గాల్లో కలుపుతున్న వైనం

మంచిర్యాల జిల్లాలో ఒకే వారంలో ఇద్దరు మృతి 

మంచిర్యాల, సెప్టెంబర్ 30 (వి జయక్రాంతి) : జిల్లాలోని మండ ల కేంద్రాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్ర జలకు ఆర్‌ఎంపీలు, పీఎంపీలే సింహభా గం వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే, ఎలాంటి పట్టాలు, పరిజ్ఞా నం లేకుండా స్థాయికి మించి వైద్యం చేస్తూ రోగులను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టుతు న్నారు.

ఆర్థిక పరిస్థితులు, నిరక్షరాస్యత, అం దుబాటులో సర్టిఫైడ్ వైద్యులు లేని కారణం గా గత్యంతరం లేక ఆర్‌ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్)లు, పీఎంపీ(ప్రైవేటు మెడిక ల్ ప్రాక్టీషనర్స్)లను ఆశ్రయిస్తున్నారు. రోగు ల అవసరాలను అవకాశంగా తీసుకొని ప లువురు అర్హతలు లేకున్నా చికిత్స అందిస్తున్నారు.

కొందరైతే ఏకంగా నర్సింగ్ హోం లు, హాస్పిటల్స్‌ను నిర్వహిస్తూ వైద్యులుగా చెలామని అవుతున్నారు. ఇష్టారాజ్యంగా హై డోస్ మందులు ఇస్తూ, స్లున్‌లు పెడుతూ, ఇ ంజక్షన్లు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నా రు. జిల్లా వ్యాప్తం గా ౮౬౩ మంది ఆర్ ఎంపీలు, పీఎంపీలు వైద్యం అందజేస్తున్నారు.

అర్హతలకు మించి వైద్యం 

కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే అందించాల్సిన కొందరు ఆర్‌ఎంపీలు, పీఎ ంపీలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. మెడికల్ షాపులతోపాటు ల్యాబ్‌లు నిర్వహిస్తూ బెడ్‌లను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. కొన్ని సందర్భాలలో చిన్న శస్త్రచి కిత్సలు కూడా చేస్తున్నారు. అలా రోగుల ప్రాణాల మీదికి తెస్తున్నారు.

కొందరు మా త్రమే ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపుతున్నారు. మరికొందరేమో ప్రైవేటు ఆసుపత్రులు ఇచ్చే కమీషన్లు, నజరానాల కోసం జిల్లా కేంద్రం, పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోంలకు రోగులను పంపుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. 

కనిపించని ధ్రువీకరణ పత్రాలు 

ఎలాపడితే అలా ప్రాథమిక వైద్యం అం దించకూడదనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వపరంగా ఆర్‌ఎంపీలు, పీఎంపీలు అందించే వైద్యంపై నిపుణులైన వైద్యులు శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. వాటిని ఆధారంగా చేసుకొని కొందరు అర్హత లేకపోయినా చికిత్సలు చేస్తున్నారు.

ఎలాంటి ప ట్టాలు, పరిజ్ఞానం లేకుండానే శిక్షణ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని వైద్య పట్టాగా చూపు తూ చికిత్సలు చేస్తున్నారు. హైడోస్ ఇంజక్ష న్లు, విచ్చలవిడిగా యాంటిబయాటిక్స్ ఇస్తు ండటంతో సైడ్ ఎఫెక్ట్‌లతో రోగులు ఇబ్బ ంది పడుతున్నారు. 

 వారంలో ఇద్దరు మృతి

లక్షెట్టిపేట మండలం కొత్తకొమ్ముగూడెం పం చాయతీ పరిధిలోని కొర్విచెల్మకు చెందిన బత్తుల మధూకర్ (26)కు ఈ నెల 18న జ్వరం రావడంతో ఆర్‌ఎంపీ శ్రీనివాస్‌ను ఆశ్రయించాడు. స్లున్‌తో పాటు ఇంజక్షన్లు ఇవ్వడంతో ఒక్కసారిగా చలి పెరిగి వణుకు ఎక్కువవడంతో తిరిగి ఆర్‌ఎంపీని సంప్రదించాడు. డోసు ఎక్కువైందని మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.

వైరస్ మెదడుకు సోకిందని చెప్పడంతో బంధువులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మూడు రోజుల అనంతరం ఈ నెల 21న బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు ప్రకటించారు. మధూకర్ ఈ నెల 24న మరణించాడు. నస్పూర్ మండలం నాగార్జున కాలనీకి చెందిన చింతం శ్రీలత (24)కు ఈ నెల 27న రాత్రి జ్వరం రావడంతో మరుసటి రోజు ఉదయాన్నే సమీపాన ఉన్న పీఎంపీ బిరుదుల ప్రశాంత్‌ని సంప్రదించారు.

అతను ఇంటికి వచ్చి మొదట స్లున్ పెట్టాడు, అనంతరం జ్వరం, బీపీ పరిక్షించకుండానే పారాసిటమాల్ ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో చలి విపరీతంగా పెరిగి, వాంతులు, విరోచనాలు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు చేర్చుకోకపోవడంతో హైదరాబాద్‌కు తరలించారు. శ్రీలతను పరీక్షించిన వైద్యులు ఆదివారం సాయంత్రం బ్రెయిన్‌డెడ్ అయ్యిందని తెలిపారు. కాసేపటికి మృతి చెందినట్టు నిర్ధారించారు.

ప్రథమ చికిత్సకే పరిమితమవ్వాలి 

ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికి త్సకే పరిమితమవ్వాలి. ఇంజక్షన్ కూడా వే యొద్దు. జ్వరం తీవ్రంగా ఉంటే సమీప ఆరోగ్య కేంద్రానికి రోగిని తరలించడానికి సహకరించాలి. ఇష్టారీతిగా వైద్యం చేస్తు న్నట్టు గతంలో కొందరిని గుర్తించి చర్య లు తీసుకున్నాం. అలాంటి వారిపై ఫిర్యా దు చేస్తే చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తు లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం 

 డాక్టర్ హరీశ్ రాజ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, మంచిర్యాల