calender_icon.png 2 March, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉస్మానియా యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందిన శంకర జ్యోతి

01-03-2025 10:23:34 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తికి చెందిన జి.పద్మావతి-సోమిరెడ్డి దంపతుల కూతురు శంకర జ్యోతికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్ డీగ్రీ పట్టా లభించింది. ఖమ్మం జిల్లాలోని ట్రైబల్ గురుకులం డిగ్రీ కళాశాలలో శంకర జ్యోతి అధ్యాపకురాలుగా చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో శంకర జ్యోతికి స్టడీ ఆన్ రెగ్యులర్ డి మానుస్టేషన్ ఇన్ గ్రాఫిక్స్ లో ఇచ్చిన పరిశోధనా పత్రానికి పట్టా లభించింది.

బెల్లంపల్లిలోని వాణినికేతన్ పాఠశాలలో ప్రాధమిక విద్యను, ఇక్కడే ప్రగతి కళాశాలలో ఇంటర్, మంచిర్యాలలోని సీవీ రామన్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కోర్సు, హైదరాబాద్ లోని సంహిత పీజీ కళాశాలలో పీజీ విద్యను పూర్తి చేశారు. గణితంలో ఇబ్బందులు పడే వారికి సులభంగా అర్ధమయ్యే విధముగా ఉండేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పిహెచ్డీ పూర్తిచేసినట్లు శంకరజ్యోతి తెలిపారు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం అయిన తన తల్లిదండ్రులకు ఋణపడి ఉంటానని చెప్పారు. తనకి సహాయ సహకారాలు అందించిన ఉస్మానియా యూనివర్సిటీ గణిత విభాగంలోని ప్రొఫెసర్లు, కుటుంబ సభ్యులకు శంకర జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు.