calender_icon.png 1 April, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంకర్ వరప్రసాద్.. కొబ్బరికాయ కొట్టేశాడు!

31-03-2025 12:12:47 AM

యాక్షన్- ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ నుంచి ఎమోషనల్ డ్రామాల వరకు దాదాపు ప్రతి జానర్‌లో సినిమాలు చేసి విజయాలను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడాయన గతానికి భిన్నమైన ప్రాజెక్టుతో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నారు.

ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’తో రికార్డు స్థాయి విజయాలన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను షైన్‌స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మితా కొణిదెల గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తు న్నారు. అర్చన సమర్పిస్తున్నారు.

‘మెగా157’ అనే మేకింగ్ టైటిల్‌తో అధికారికంగా ఈ సినిమా తాజాగా ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. పలువురు సినీప్రముఖుల సమక్షం లో పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభించా రు. విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛ్‌ఆన్ చేశారు. సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు.

స్టార్ నిర్మా తలు దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా నాగవంశీ, యూవీ క్రియేషన్స్ విక్రమ్, దర్శకుడు వశిష్ట, శ్రీకాంత్ ఓదెల, బాబీ, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి, మైత్రి నవీన్ యెర్నేని, రవికుమార్, శిరీష్, అశ్వినిదత్, రామ్ ఆచంట, శరత్, విజయేం ద్రప్రసాద్, కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, సురేశ్‌బాబు, వెంకట సతీశ్ కిలారు, జెమిని కిరణ్, చుక్కపల్లి అవినాష్, నిమకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారం భించనున్నట్టు దర్శక నిర్మాతలు ఈ సందర్భంగా వెల్లడించారు. చిరంజీవి.. శంకర్‌వరప్రసాద్ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రా నికి సమీర్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎస్ కృష్ణ, జీ ఆది నారాయణ రైటర్స్‌గా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.