calender_icon.png 24 January, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎన్టియూసి ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ గా శంకర్ నాయక్ నియామకం

23-01-2025 10:44:03 PM

ఐఎన్టియూసి కేంద్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా కొత్త సత్యనారాయణ రెడ్డి

యూనియన్ సెక్రటరీ జనక్ ప్రసాద్...

రామగుండం (విజయక్రాంతి): ఐఎన్టియూసి ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ గా శంకర్ నాయక్ ను ఐఎన్టియూసి కేంద్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా కొత్త సత్యనారాయణ రెడ్డిని నియామకం చేస్తూ యూనియన్ సెక్రటరీ జనరల్, తెలంగాణా రాష్ట్ర కనిస వేతన సలహా మండలి చైర్మన్  జనక్ ప్రసాద్ గురువారం స్థానిక జనక్ భవన్ లో నీయమక పత్రాలు అందజేశారు. ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షులు డా. జీ సంజీవ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచన మేరకు సింగరేణిలో ఎల్లపుడూ కార్మిక పక్షాన పోరాడే యూనియన్ ఐఎన్టీయూసీ అర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ గా శంకర్ నాయక్ ని, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులుగా కొత్త సత్యనారాయణరెడ్డిని ప్రకటిస్తూ వారికి నియామకం చేశామన్నారు.

ఈ సందర్భంగా యూనియన్ రథసారథి జనక్ ప్రసాద్ మాట్లాడుతూ.. యూనియన్ బలోపేతం కార్మికుల హక్కుల పరిక్షణకై ఎల్లపుడూ పోరాడుతూ రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అందరినీ కలుపుకొని పని చేయాలని కోరారు. వారి నియామకం పట్ల పెద్దలు జతీయ అద్యక్షులు డా. "సంజీవ రెడ్డికి రాష్ట్ర మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ కార్మికుల హక్కుల సాధన రాబోయే ఎన్నికల్లో గెలుపేధ్యేయంగా పని చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, అక్రమ్, దాస్, వికాస్ కుమార్ యాదవ్, సదానందం, గడ్డం కృష్ణ, సంపత్ రెడ్డి, ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.