calender_icon.png 16 January, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శని త్రయోదశి పూజలు

31-08-2024 02:36:29 PM

రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ఆవరణలోని నవగ్రహ మండపంలో శనీశ్వరునికి తైలాభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కూడా నవగ్రహాలకు పూజలు జరిపించుకొని తమ కుటుంబం పిల్ల పాపలతో సుఖసంతోషాలతో ఉండాలని తమ శని తొలగిపోవాలని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు