బెంగళూరు: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ రీ ఎంట్రీ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తు న్నాయి. రంజీల్లో తనను తాను నిరూపించుకునే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడతానని షమీ ఇది వరకే ప్రకటించాడు. త్వరలో జరగబోయే బోర్డర్ టోర్నీకి కూడా షమీ అందుబాటులో లేడు. ఇక ఇప్పుడు బెంగాల్ జట్టు ఆడబోయే తదుపరి రెండు రౌండ్ల రంజీ మ్యాచులకు కూడా షమీని పరిగణలోకి తీసు కోలేదు.
బుధవారం కర్ణాటకతో, నవంబర్ 13న మధ్యప్రదేశ్‌తో బెంగా ల్ మ్యాచ్‌లు ఆడనుంది. కర్ణాటకతో మ్యాచ్‌లో షమీ మైదానంలోకి దిగుతాడని అంతా అనుకున్నా కానీ అలా మాత్రం జరగలేదు. ఈ మధ్యే షమీ తాను 100 ఫిట్‌గా ఉన్నట్లు తెలిపాడు. త్వరలోనే పూర్తిస్థాయి మ్యాచ్ ఆడతానని తెలిపాడు.