- త్వరలో చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన
- నేడో రేపో ప్రకటించే అవకాశం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం త్వరలో భారత జట్టును ప్రకటించే అవకాశముంది. జనవరి 12 డెడ్‌లైన్ కావడంతో మరో రెండు రోజుల్లో బీసీసీఐ తుది జట్టును ఎంపిక చేయనుంది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌కు కూడా జట్టును ప్రకటించనుంది.
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బుమ్రా గైర్హాజరీ అయ్యే అవకాశమున్నందున సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. షమీతో పాటు కేఎల్ రాహుల్ కూడా ఆడే చాన్స్ ఉంది. ఆల్‌రౌండర్ల కేటగిరీలో జడేజా, అక్షర్ పటేల్‌లో ఎవరు చోటు దక్కించుకుంటార్నది ఆసక్తికరంగా మారింది.
రెగ్యులర్ వికెట్ కీపర్ పంత్‌కు బ్యాకప్‌గా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లలో ఒకరికి చాన్స్ దక్కనుంది. కుల్దీప్ ఫిట్‌నెస్ సాధించకపోతే రవి బిష్ణోయి లేదా వరుణ్ చక్రవర్తిలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కనుంది. మరో రెండు రోజుల్లో జట్టు ప్రకటనపై పూర్తి క్లారిటీ రానుంది.