calender_icon.png 29 April, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి పట్టుబడిన షామీర్‌పేట్ ఎస్‌ఐ

29-04-2025 12:00:00 AM

మొదటి విడత రూ.2 లక్షలు చెల్లింపు 

రెండో విడత రూ.22 వేలు డస్ట్ బిన్ లో వేయించిన ఎస్‌ఐ 

మేడ్చల్, ఏప్రిల్ 28(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా షామీర్పేట ఎస్‌ఐ పరశురాం రూ. 22 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ కథనం ప్రకారం ఆయిల్ ప్యాకెట్లు రవాణా చేస్తుండగా కొన్ని మాయమయ్యాయి. దీంతో యజమాని షామీర్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అనుమానితులను విచారించారు. తక్కువ సెక్షన్లు నమోదు చేయాలంటే 2 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని ఎస్త్స్ర పరశురాం డిమాండ్ చేశారు. దీంతో వారు ఈనెల 23న డబ్బులు తీసుకొని రాగా, తన కారులో పెట్టాలని ఎస్‌ఐ సూచించాడు.

ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి అందులో డబ్బులు తక్కువ ఉన్నాయని మరో రూ.25 వేలు తీసుకురావాలని డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేమని రూ. 20 వేలు ఇస్తామని చెప్పారు. కానిస్టేబుల్ లకు 2000 ఇవ్వాల్సి ఉంటుందని, మొత్తం 22,000 తీసుకురావాలని ఎస్త్స్ర చెప్పారు. దీంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితులు ఎస్త్స్ర వద్దకు డబ్బులు తీసుకెళ్లగా చెత్త బుట్టలు వేయాలని సూచించాడు. వెంటనే ఏసీబీ అధికారులు చెత్తబుట్టలోని రెండువేల స్వాధీనం చేసుకొని, ఎస్త్స్రని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారిస్తున్నామని ఏసీబీ డిఎస్పి తెలిపారు.