calender_icon.png 28 February, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షమీమ్ అక్తర్ నివేదికలో లోపాలను సవరించాలి

28-02-2025 01:17:43 AM

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో లోపాలను సవరించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్‌మాది గ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడారు.

నివేదికలో లోపాలను సవరించి, మార్చి 10 లోపు ఎస్సీలను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించాలని కోరారు. మార్చి 3 నుంచి 10 వరకు మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో డప్పు ల ప్రదర్శన, కళాకారులతో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ, అననుబంధ సంఘాల నాయకు లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేయకుంటే మార్చి 11న భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.

మంత్రివర్గంలో మాదిగలకు రెండు పదవులివ్వాలని కోరారు. కాగా మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని మార్చి 1న ఘనంగా నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలకు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. వారి జ్ఞాపకార్థం హైదరాబాద్ సమీపంలో ఐదు ఎకరాల్లో మాదిగ అమరవీరుల మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెస్పీ, ఎమ్మార్పీఎస్, దాసరి హక్కుల పోరాట సమితి నాయకులు  పాల్గొన్నారు.