న్యూఢిల్లీ: ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరమైన టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బెంగాల్ తరఫున మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు వేసిన ఈ బెంగాలీ బౌలర్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. ప్రతిష్టాత్మక బోర్డర్ ట్రోఫీలో భారత్ తరఫున షమీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించినా బోర్డర్ ట్రోఫీకి ప్రకటించిన జట్టులో షమీకి చోటు దక్కలేదు.
దేశవాళీలో నిరూపించుకున్న తర్వాత మాత్రమే ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావించారు. తాజాగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమీ రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్న దానిపై అతడి ఎంపిక ఆధారపడి ఉంది. షమీని ఆస్ట్రేలియా ఫ్లుటై ఎక్కించాలని సెలెక్టర్లు భావిస్తే బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిధ్, హర్షిత్ రానాలతో కూడిన పేస్ విభాగం మరింత పటిష్టం కానుంది.