calender_icon.png 19 January, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలా అన్నందుకు సిగ్గు పడుతున్నా..

19-01-2025 12:00:00 AM

సైఫ్ అలీఖాన్‌కు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా క్షమాపణ చెప్పారు. సైఫ్‌పై జరిగిన దాడి ఘటనపై సెలబ్రిటీలు స్పందించారు. ఆయన కోరుకోవాలని ఆకాంక్షించారు. అలాంటి సీరియస్ సిట్యువేషన్‌లో ఊర్వశి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. దాడి ఘటనపై ఊర్వశి మాట్లాడుతూ.. “సైఫ్‌పై దాడి బాధాకరం. ‘డాకు మహారాజ్’ సూపర్ హిట్‌గా నిలివడంతో మా అమ్మ నాకు వజ్రపు ఉంగరం బహుమతిగా ఇచ్చింది.

మా నాన్న రోలెక్స్ వాచ్ ఇచ్చారు. కానీ వీటని బహిరంగంగా ధరించి బయటకు వెళితే ఎవరైనా దాడి చేస్తారనే భయం ఉంటుంది” అని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. దీంతో ఇన్‌స్టా వేదికగా సైఫ్‌కు క్షమాపణ చెబుతూ ఊర్వశి పోస్ట్ పెట్టింది. తన వ్యాఖ్యల పట్ల సిగ్గు పడుతున్నానని తెలిపింది. “సైఫ్ సర్.. మీకు ఈ మెసేజ్ చేరుతుందని ఆశిస్తున్నా.

మీ గురించి మాట్లాడే సమయంలో నా ప్రవర్తనకు విచారం వ్యక్తం చేస్తున్నా. ఈ విషయంలో క్షమాపణలు కోరుతున్నా. మీపై దాడి తీవ్రత గురించి నాకు తెలియదు. ‘డాకు మహారాజ్’ విజయోత్సాహంలో ఉన్న నేను నాకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను. అలా మాట్లాడినందుకు సిగ్గు పడుతున్నా. నన్ను క్షమించండి. దాడి తీవ్రత తెలిశాక చాలా బాధపడ్డాను. ఆ సమయంలో మీ ధైర్యంగా అభినందనీయం” అని ఊర్వశి రౌతేలా పేర్కొంది.