విభిన్నమైన కథాంశాలతో వెండితెరపై ప్రయోగాలు చేస్తున్న యువ కథానాయకుడు ఆదిసాయికుమార్ ప్రేక్షకులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు వస్తున్నాడు. ఆయన హీరోగా ‘శంబాల’ అనే చిత్రం తెరకెక్కుతోంది. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆదిసాయికుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ‘సూర్య 45’ చిత్రంలో నటిస్తున్న శ్వాసిక ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తుండగా రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే తెలియజేయనుంది.