calender_icon.png 17 January, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భోగి మంట వేద్దామా..

14-01-2025 12:00:00 AM

హిందూ సంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ముందు వచ్చే రోజును భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తారు. గడిచిన దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలను కొత్త సంవత్సరంలో ఉండకూడదని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. శాస్త్రీయ పరంగా చూస్తే సూర్యుడు దక్షిణయానంలో భూమికి దూరంగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది.

ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధల నుంచి తప్పించుకునేందుకు కూడా భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు కేవలం చలి నుంచి కాపాడటం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఈ పొగను పీల్చడం వలన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.