calender_icon.png 14 October, 2024 | 6:53 AM

చంద్రయాన్-4 శిక్షణకు ‘శక్తిశాట్’

14-10-2024 03:33:01 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: స్పేస్ కిడ్జ్ ఇండియా అనే ఏరోస్పేస్ అంకుర సంస్థ శక్తిశాట్ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇస్రో చంద్రయాన్-4 మిషన్‌లో ప్రయోగించేలా ఉపగ్రహాన్ని రూపొందించే లక్ష్యంతో 108 దేశాలకు చెందిన 12 వేలమంది బాలికలకు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము త్వరలో ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవి ష్కరించనున్నారు.

శక్తిశాట్ ద్వారా 14 ఏండ్ల మధ్య వయసున్న 12 వేల మంది హైస్కూల్ విద్యార్థినులకు అంతరిక్ష సాంకేతికత, పేలోడ్ అభివృద్ధి, వ్యోమనౌక వ్యవస్థల గురించి ఆన్‌లైన్ వేదిక ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ఈ మిషన్‌కు నేతృత్వం వహిస్తున్న కేసన్ తెలిపారు. బ్రిటన్, యూఏఈ, బ్రెజిల్, కెన్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, గ్రీస్, శ్రీలంక తదితర దేశాలు భాగం కానున్నాయి. శిక్షణ అనంతరం ప్రతి దేశం నుంచి ఒకరి చొప్పున 108 మందిని ఎంపిక చేస్తారు.