ముంబై, అక్టోబర్ 27: ప్రపంచంలో టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా 2024 సంవత్సరానికి రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్‌ను యూఎస్‌కు చెందిన గ్లోబల్ ఫైనా న్స్ మ్యాగజైన్ ఎంపికచేసింది. ఈ టాప్ ర్యాంక్‌ను శక్తికాంత్ దాస్ సాధించడం వరుసగా ఇది రెండో సంవత్సరం. 2024 సం వత్సరపు సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డుల్లో ఏ+ గ్రేడ్ ఆవార్డును వాషింగ్‌టన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ దాస్ స్వీకరించారని రిజర్వ్‌బ్యాంక్ ఎక్స్ పోస్టులో తెలిపింది.
ఏ+ రేటింగ్ లభించిన ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లలో శక్తికాంత దాస్ టాప్‌లో నిలిచినట్టు వెల్లడించింది. ద్రవ్యోల్బణం అదుపు, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ తదితర అంశాల ద్వారా ఏ నుంచి ఎఫ్ వరకూ సెంట్రల్ బ్యాంకర్లకు గ్రేడ్స్ నిర్ణయిస్తామని గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఒక ప్రకటనలో వివరించింది.
ఏ+ క్యాటగిరీ సెంట్రల్ బ్యాంకర్లగా శక్తికాంత్ దాస్‌తో పాటు డెన్కార్క్ సెంట్రల్ బ్యాంకర్ క్రిస్టియన్ కెట్టెల్ థామ్సన్, స్విట్జర్లాండ్‌కు చెందిన థామస్ జోర్డాన్‌లు ర్యాంక్‌లు పొందారు.