23-02-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని మోదీ పదవీకాలంతో సమానంగా లేదా తదుపరి ఉత్త ర్వులు ఇచ్చే వరకు శక్తికాంతదాస్ ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా 1980 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయ న.. 2018 డిసెంబర్‌లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి ఆరేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఇదిలా ఉంటే గుజరాత్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ప్రస్తుతం ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.