ఎన్సీపీ, శివసేన(షిండే) మధ్య తారాస్థాయికి విభేదాలు
ముంబై (మహారాష్ట్ర), ఆగస్టు 30: మహారాష్ట్రలో షిండే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటికే ఎన్సీపీ పార్టీతో పొత్తుపై బాహాటంగానే శివసేన మంత్రులు విమర్శలు గుప్తిస్తుంటే.. తాజాగా గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో శివసేన (షిండే) మంత్రి తానాజీ సావంత్.. ఎన్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో ఎన్సీ పీ నేతల పక్కన కూర్చుంటే తనకు వికారంగా ఉండటంతో పాటు వాంతులు అవు తున్నాయని తానాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అజిత్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేతలతో ఎప్పుడూ సఖ్యత కుదరలేదని స్పష్టం చేశారు. తానాజీ వాఖ్యలను ఎన్సీపీ అధికార ప్రతినిధి అమోల్‌మిత్కారీ ఖండించారు. సంకీర్ణ ధర్మాన్ని కాపాడేందుకు తాము సైలెంట్‌గా ఉన్నామని.. మా అధినేత ఒక్క మాట చెప్తే.. శివసేన నేతలకు తగిన బుద్ధి చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన దీటుగా రిప్లు ఇచ్చారు. మహారాష్ట్ర అధికార కూటమిలో బీజీపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్) భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడు పార్టీల మధ్య గత కొన్నేళ్లుగా సఖ్యత కుదరడం లేదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. శివసేన మంత్రి తానాజీ వార్తలు ఆసక్తిని రేపాయి.