calender_icon.png 16 January, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సియామ్ కొత్త ప్రెసిడెంట్‌గా శైలేష్ చంద్ర

11-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఆటోమొబైల్ కంపెనీ అసోసియేషన్ సియామ్ కొత్త ప్రెసిడెంట్‌గా టాటా మోటార్స్ పాసింజర్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర నియమితు లయ్యారు. వోల్వో ఐషర్ కమర్షియల్ సీఈవో వినోద్ అగర్వాల్ స్థానంలోకి ఇప్పటివరకూ సియామ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న చంద్ర వస్తారని సొసైటీ ఆఫ్ ఇండియన్ మా న్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అశోక్ లేలాండ్ ఎండీ, సీఈవో షేను అగర్వాల్ కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నియ్యారు. డైమ్లర్ ఇండియా సీఈవో సత్యకం ఆర్య ట్రెజరర్‌గా నియమితులయ్యారు.