లిమా: అండర్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత అథ్లెట్ షారుక్ ఖాన్ జాతీయ రికార్డు నెలకొల్పాడు. గురువారం 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ హీట్ రేస్‌ను షారుక్ 8 నిమిషాల 45.12 సెకన్లలో పూర్తి చేసి ఆరో స్థానంలో నిలిచాడు. తద్వారా శనివారం జరగనున్న ఫైనల్స్‌కు షారుక్ అర్హత సాధించాడు. గతంలో 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో పర్సనల్ బెస్ట్ 8 నిమిషాల 51.75 సెకన్లుగా ఉంది.