calender_icon.png 25 March, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా షహీద్ దివస్ వేడుకలు

24-03-2025 12:18:13 AM

కరీంనగర్ క్రైమ్, మార్చి23 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ కరీంనగర్  ఆధ్వర్యంలో  ఆదివారం  పట్టణంలోని భగత్ నగర్ భగత్ సింగ్ విగ్రహం వద్ద షహీద్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి,  తాజా మాజీ మేయర్ సునీల్ రావు లు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. 

బిజెపి నాయకులు  నాంపల్లి శ్రీనివాస్ , మాడ వెంకటరెడ్డి , బల్బీర్ సింగ్ , బండ రమణారెడ్డి, చొప్పర్ జయశ్రీ , బండారు గాయత్రి, వరల జ్యోతి,నరేందర్ ,పొన్నం మొండయ్య ,తణుకు సాయి, రాజు , గాజుల వేణుగోపాల్, రామకృష్ణారెడ్డి ,బొడ్ల శ్రవణ్, వంగ సంపత్, పిట్టల సుమంత్ ,వంశీ  అనుదీప్, ధోలీ ఉపేందర్ ,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.