బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మాత్రం దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేయనున్నారు. అయితే సినిమా కాదు.. వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడట ఆర్యన్. దీన్ని 2025లో విడుదల చేయనున్నారు. ఈ విషయమై నెట్‌ఫ్లిక్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. ‘స్టార్‌డమ్’ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం.
కంగన ప్రశంసలు
ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీపై కంగనా రనౌత్ స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రా మ్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘స్టార్ కిడ్స్ నటీనటు లుగా మారడం సాధారణం. దాన్ని మించి వెళ్లాలనుకోవడం గొప్ప విషయం. ప్రస్తుతం భారతీయ సినిమా స్థాయిని పెంచుకోవడం అవసరం చాలా ఉంది. కెమెరా వెనక నిలబడటానికి ఎంతోమంది కావాలి.
తక్కువ మంది ఎంచుకున్న మార్గాన్ని ఆర్యన్ ఎంచుకోవడం ప్రశంసనీయం. రచయితగా, ఫిల్మ్ మేకర్‌గా అతడి ఆరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నా’ అని రాసుకొచ్చింది. అయితే ఎప్పుడూ బాలీవుడ్ స్టార్ కిడ్స్‌పై విమర్శలు గుప్పించే కంగన.. ఆర్యన్ ఖాన్‌ను ప్రశంసిస్తూ పోస్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యపర్చింది.