02-03-2025 12:15:41 AM
8లోగా జనాలు స్వేచ్ఛగా రోడ్లపై తిరగాలి
న్యూఢిల్లీ, మార్చి 1: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్ పరిస్థితులపై శనివారం అధికారులతో కలిసి హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ‘ఈ నెల 8 నుంచి మణిపూర్ రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిర గాలి’ అని షా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పరిస్థితులకు ఆటంకం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
‘కేంద్రం మణిపూర్‌లో శాంతిస్థాపనకు అన్ని చర్యలు తీసుకుంటోంది. అవసరమైన సాయం చేస్తాం’ అని షా తెలిపారు. ఫిబ్రవరి 13న మణిపూ ర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన విధింపు తర్వాత అమిత్ షా అధికారులతో ఉన్నతస్థాయి మీటింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖలో జరిగిన ఈ సమావేశానికి మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లా, మణిపూర్ ప్రభుత్వ అధికారులు, ఆర్మీలో ఉన్నత స్థాయి అధికారులు, పారామిలటరీ సీనియర్ అధికారులు తదితరులు హాజరయ్యారు.