calender_icon.png 24 December, 2024 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షా వ్యాఖ్యలతో ప్రజల గుండెల్లో గాయం

24-12-2024 01:04:15 AM

  1. వారం రోజులపాటు కాంగ్రెస్ ఆందోళనలు 
  2. నేడు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు ఫిర్యాదులు 
  3. రాజ్యాంగంలో మనుస్మృతిని చొప్పించేలా బీజేపీ యోచన 
  4. కేంద్ర మంత్రి వర్గం నుంచి ఆయన్ని బర్తరఫ్ చేయాలి
  5. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ  

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల గుండెల్లో గాయం చేశాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ అన్నారు. రాజ్యాంగంలో మనుస్మృతిని ప్రవేశపెట్టాలని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఆలోచన చే స్తున్నాయని ఆరోపించారు.

అంబేద్కర్‌ను అవమానించేవిధంగా మాట్లాడిన అమిత్‌షా మం త్రి పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాప ణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడే బీజేపీ ఏదో ఒక డ్రా మా చేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు హర్కర వే ణుగోపాల్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్, పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డితో కలిసి సోమవారం గాంధీభవన్‌లో మీడి యాతో మాట్లాడారు.

అంబేద్కర్ సమ్మాన్ పే రుతో వారం పాటు కాంగ్రెస్ పార్టీ నిరసన కా ర్యక్రమాలు చేస్తోందని తెలిపారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు నివాళి అర్పించి, కలెక్టర్లకు అమిత్‌షాపై ఫిర్యా దు చేస్తామన్నారు. అమిత్‌షా రాజీనామా చే యాలన్నదే కాంగ్రెస్ డిమాండ్ అని ఉద్ఘాటించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో స్కావెంజర్ల గురించి కూడా ప్రజా వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నదని గుర్తుచేశారు. అంబేద్కర్ సామాజిక ఉద్యమకారుడు కాదని మోదీ కూ డా అన్నారని ఆరోపించారు. హైదరాబాద్ సెం ట్రల్ యూనివర్సిటీలో రోహిత్ చనిపోయినప్పుడు కూడా మోదీ మౌనంగా ఉన్నారన్నా రు.

రాజ్యాంగం కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీల కో సమే కాదని, దేశ ప్రజలందరిదనే విషయం తెలుసుకోవాలని హితవు పలికారు.  అమిత్‌షా ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఏఐసీసీ నాయకుడు రాజు డిమాండ్ చేశారు. అమిత్‌షా మాట్లాడిన తర్వాత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో అంబేద్కర్‌ను అ వమానించింది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పడం దుర్మార్గమని అన్నారు.

రాజ్యాంగ డ్రాప్టింగ్ క మిటీకి అంబేద్కర్‌ను చైర్మన్‌గా ఎన్నుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని, రాజ్యాంగ నిర్మాణానికి సహకరించింది కూడా కాంగ్రెస్ అనే విషయా న్ని తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ చేసిన రా జ్యాంగ సవరణలన్నీ పేదల కోసమేనని స్పష్టంచేశారు.

అనంతరం పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. అమిత్‌షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలతో ప్ర జల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నట్టు వెల్లడించారు.