చెన్నై: భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్, షఫాలీ వర్మ శుక్రవారం అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీగా అవతరించింది. దక్షిణాఫ్రికాతో చెన్నైలో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో షఫాలీ ఈ ఫీట్ నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు పలు రికార్టులను సృష్టించింది. టెస్టులో ఒకరోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. భారత మహిళ జట్టు ఒక రోజులో 509 పరుగుల రికార్డును అధిగమించింది. భారత మహిళ జట్టు దక్షిణాఫ్రికాపై తొలిరోజే 525/4 స్కోర్ చేసింది. పురుషుల, మహిళల టెస్టు క్రికెట్ లో ఒకరోజులో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. శ్రీలంక జట్టు 2002లో బంగ్లాదేశ్ పై ఒక రోజులో 509/9 స్కోర్ చేసింది. మహిళల క్రికెట్ లో తొలి వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం నమోదైంది. భారత్ తొలి వికెట్ కు 292 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. షఫాలీ మర్మ(205) డబుల్ సెంచరీ, స్మృతి మంధాన(149)తో సత్తా చాటారు. ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు(8) కొట్టిన మహిళ క్రికెటర్ గా షషాలీ రికార్డు నెలకొల్పింది.