calender_icon.png 1 April, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షడ్రుచుల పరమార్థం

30-03-2025 12:00:00 AM

జీవితమంటేనే కష్ట సుఖాల సమ్మేళనం. తీపి, చేదు, వగరు, పులుపు.. ఇలా జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు ప్రతీకగా నిలిచే ఉగాది పచ్చడితో కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించడం మనందరికీ అలవాటే. నేడుఉగాది పర్వదినం కావడంతో షడ్రుచుల విశిష్టత గురించి తెలుసుకుందాం.. 

ఉగాది అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది పచ్చడి. ఇది మానవాళి జీవితంలో జరిగే కష్టనష్టాలను, సోపానాలను తెలియజేస్తుంది. ఆరు రుచులతో చేసే పచ్చడి 

జీవిత సత్యాలను  సూచిస్తుంది. 

 వేప పువ్వు 

వేప పువ్వు.. చేదుగా ఉంటుంది. జీవితంలో బాధకరమైన అనుభవాలకు సంకేతం. 

ఉప్పు

ఇది జీవితంలో ఉత్సాహనికి సూచిక. బాగా గుర్తుండి పోయే మంచి సంఘటనలకు నిదర్శనం.

పచ్చి మామిడి

మామిడి.. వగరు. కొత్త సవాళ్లను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొం టుంది. కొన్ని ప్రాంతాల్లో అరటి, కొబ్బరి కూడా వేస్తారు. 

బెల్లం

తీపి ఆనందానికి ప్రతీక. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా నోరు తీపి చేసుకోవడం ఆనవాయితే కదా.

చింతపండు

పులుపు అనేది జీవిత గమనంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. మంచీచెడులను జాగ్రత్తగా తెలుసుకుని మసులుకోవాలి. 

కారం

ఇది సహనం లేకుండా పోయే పరిస్థితులు ఉత్పన్నమయితే మనిషి గందరగోళంలో పడుతాడు. ఆవేశానికి గురికావొచ్చు. అదీ జీవితంలో ఒక భాగమేనని అర్థం. 

ఇట్ల చేద్దాం..  

కావాల్సిన పదార్థాలు: వేపపూత కొద్దిగా, చింతపండు నిమ్మకాయంత, కారం బెల్లం ఉప్పు మామిడికాయ కావాల్సినంత పరిమాణానికి తగ్గట్టుగా పదార్థాలు తీసుకోవాలి. 

తయారీ విధానం: ముందుగా చింతపండు 45 నిమిషాల పాటు నానబెట్టి గుజ్జును తీసుకోవాలి. ఒక వేళ చింతపండు అందుబాటులో లేకపోతే నిమ్మకాయని ఉప యోగించొచ్చు. వగరు కోసం మామిడికాయ పిందెను తీసుకొని చెక్కు తీసి సన్న గా తరగాలి. వేపపూత కాడల నుంచి వేరుచేసి తెల్లగా ఉండే పూరెబ్బలను మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ వేపపూత అందుబాటులో లేకపోతే నానబెట్టిన మెంతులు, మెంతుల పొడి కూడా వాడొచ్చు. ఒక గిన్నెలో చింతపండు గుజ్జు, మనకి కావాల్సినంత పరిమాణంలో మంచినీళ్లు పోయాలి. దాంట్లో బెల్లం, కారం, ఉప్పు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన ఉగా ది పచ్చడి తయారైపోయింది. 

- బండి సరిత, ఉపాధ్యాయురాలు, వనపర్తి