29-04-2025 12:58:28 AM
నిజామాబాద్ ఏప్రిల్ 28 (విజయ క్రాంతి): ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందిన హిందూ ఫోటోగ్రాఫర్ రమణకు ప్రభుత్వ సలహాదారు, నిజామాబాద్ అర్బన్ ఇంచార్జీ షబ్బీర్ అలీ రూ. 25 వేల ఆర్ధిక సహాయం అందించారు. ఈ నగదు ను రమణ సతీమణి కి ఈరోజు(27న) ఉదయం అందించడం జరిగింది.
హిందూ పత్రిక రెసిడెన్సీ ఎడిటర్ రవిరెడ్డి సూచన మేరకు షబ్బీర్ అలీ ఆర్ధిక సహకారం అందించారు. ఈ సందర్బంగా యూనియన్ ప్రతినిధులు షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజె - ఐజెయూ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, యూనియన్ ప్రతినిధులు ఖాన్ ధనుంజయ్, గోవిందరాజు, రతన్ లు పాల్గొన్నారు.