13-03-2025 08:36:22 PM
కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను అధిష్టానం గుర్తించాలి
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ గంప ప్రసాద్
కామారెడ్డి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ కు మంత్రి పదవి ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఆర్యవైశ్య జిల్లా మహాసభ ఉపాధ్యక్షులు కంప ప్రసాద్ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కోసం గత 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్,ఆర్యవైశ్య జిల్లా మహాసభ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా గంప ప్రసాద్ మాట్లాడుతూ మైనారిటీ నేతగానే కాకుండా మెజారిటీ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడం జరిగిందని, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని అన్నారు. కామారెడ్డి మరింతగా అభివృద్ధి కావాలంటే మంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షబ్బీర్ అలికి ఇవ్వాలని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నో శాశ్వత అభివృద్ధి పనులను పూర్తిచేసిన ఘనత ఉన్నదని అన్నారు. పార్టీలు మారిన వారికి పదవులు ఇస్తున్న అధిష్టానం పార్టీనే నమ్ముకుని ఉన్న వారిపైన సరియైన నిర్ణయం తీసుకొని న్యాయం చేయాలని అన్నారు.