calender_icon.png 22 September, 2024 | 10:38 PM

రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు

22-09-2024 08:22:34 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్రంలో వచ్చే సంవత్సరం క్రీడ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో ఒలంపిక్ క్రీడాకారిని నిక్కత్ జరీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్పీ పోస్ట్ తో పాటు ఇంటి స్థలాన్ని కేటాయించడం పట్ల కృషి చేసిన షబ్బీర్ అలీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారుల ప్రయోజనం కోసం  క్రీడా విజన్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ఔత్సాహిక క్రీడాకారుల శిక్షణ కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ కోచులను తీసుకువచ్చి శిక్షణ ఇప్పిస్తామన్నారు.

హైదరాబాదును క్రీడా హబ్బుగా తీర్చిదిద్దుతామని అన్నారు. 2036 ఒలంపిక్ క్రీడలను హైదరాబాదులో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని అన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రామీణ  యువ క్రీడాకారుల కు ప్రోత్సాహం అందించి వారి ప్రతిభను వెలికి తీస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అందించిన ప్రోత్సహి ఒలంపిక్ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ చూపారని అన్నారు. రాబోయే రోజుల్లో క్రీడలకు మరింత ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంచి క్రీడాకారులకు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.