calender_icon.png 23 February, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్ఆర్‌ఐలు తమ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి

15-02-2025 11:16:26 PM

గ్రంథాలయంలోని పాఠకులకు త్రాగునీటి వసతి అందించడం అభినందనీయం

రాష్ట్ర ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకులకు శుద్దకరమైన నీటిని అందించేందుకు అమెరికాలో స్థిరపడిన స్థానికులు 4 లక్షల ఆర్థిక సహయం అందించడంతో ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎన్‌ఆర్‌ఐలు అందించిన ఆర్థిక సహయంతో ఆర్వో ప్లాంట్‌ను నెలకొల్పి ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి కృషితో అమెరికా, తెలంగాణ అసోసియేషన్ సీయోటెల్ దాతలు తులసీరాం బలే, నాగుల వినోద్, బర్ల సుమంత్‌రెడ్డి, పందిరి రవిందర్‌రెడ్డి, చిదుర అజయ్‌రెడ్డి, బండారపు శ్రీనివాస్‌రెడ్డిలు 4 లక్షల ఆర్థిక సహయాన్ని అందించారన్నారు. ఎన్‌ఆర్‌ఐలు సాధ్యమైనంత వరకు తమ పుట్టిన గడ్డం రుణం తీర్చుకోవాలని కొరారు.ఎన్‌ఆర్‌ఐలకు కృతజ్ఞతలను తెలిపారు.ఈ కార్యక్రమంలో గడ్డం ఇంద్రకరణ్‌రెడ్డి, చిదుర లక్ష్మారెడ్డి, కైలాస్ శ్రీనివాస్‌రావు,నుడా చైర్మన్ కేశవేణు, శ్రీధర్‌రావు, నిమ్మవిజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.