calender_icon.png 3 April, 2025 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో షబ్బీర్ అలీకి సన్మానం

31-03-2025 08:50:48 PM

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు..

కామారెడ్డి (విజయక్రాంతి): రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి సన్మానించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్ల రాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారంగుల అశోక్ రెడ్డి, భిక్కనూర్ మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్, మాజీ సర్పంచ్ బైండ్ల దశరథ్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ కోయల్ కార్ కన్నయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంప కృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆర్యవైశ్య సంఘం పిఆర్ఓ వలిపి శెట్టి భాస్కర్, చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.