17-03-2025 12:15:03 AM
కామారెడ్డి అర్బన్, మార్చి 16( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీలో మహిళా అధ్యక్షురాలుగా ఉంటూ న్యాయవాదిగా ఉన్నటువంటి షబానా బేగం ను తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ AGP గా నియమించింది.
గత కొంతకాలంగా సమాచార హక్కు చట్టం 2005 పైన అనేక అవగాహన కార్యక్ర మాలు నిర్వహించి సామాజిక కార్యకర్తగా ఎదిగిన షబానా బేగం ను కామారెడ్డిలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ఆదివారం ఘనంగా సన్మానించారు. ఏజీపీ గా నియమితులైన షబానాను సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా ప్రతినిధులు శాలువా, జ్ఞాపికలతో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జోనల్ అధ్యక్షులు సిర్నాపల్లి ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు శివపూజ లింబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వి భాస్కర్, జిల్లా మహిళా కార్యదర్శి సట్ల జమున,కార్యదర్శి అస్మ నాగిన్, కామారెడ్డి పట్టణ కార్యదర్శి జే శ్రీనివాస్,అన్వర్ గౌరీ తదితరులు పాల్గొన్నారు.