calender_icon.png 6 February, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్జీటీలకు ఓటుహక్కు కల్పించాలి

01-02-2025 12:00:00 AM

రాష్ట్రంలో రెండు టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అందరి దృష్టి అటుపై పడింది. వాస్తవానికి ఈ ఎన్నికలలో గెలిచిన వారి పాత్ర సరిగా ఉండడం లేదు. ఇందులో మార్పు రావాలి. ఎవరు గెలిచినా, ఓడినా ప్రభుత్వం సమస్యలపట్ల అవగాహనతో పరిష్కారం చూపేలా కృషి చేయాలి.

నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికలు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీల మద్దతుతో లేదా పరోక్ష సహకారంతో జరుగుతాయి. ఇంకా అనేకమంది ఉపాధ్యాయులకు ఓటు హక్కు లేకపోవడం శోచనీయం. రాబోయే కాలంలో అయినా ఎస్జీటీలకు ఓటుహక్కు కల్పించాలి.

 రావుల రామ్మోహన్ రెడ్డి