ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ..
గజ్వేల్(విజయక్రాంతి): ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కును కల్పించాలని ఎస్జీటీయూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గజ్వేల్ లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శ్రీరాం శ్రీనివాస్, జోగన్నగారి శ్రీధర్ రెడ్డిలు ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం, ఎమ్మెల్సీ అభ్యర్థి సంకినేని మధుసూదన్ రావులు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఓటుహక్కును కల్పించాలన్నారు. పెండింగ్ డీఏలు విడుదల చేయలని, 317జీవో బాధితులందరికీ షరతులు లేకుండా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బోడ వేణు, అసోసియేషన్ అధ్యక్షులుగా మంజులలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.