calender_icon.png 23 December, 2024 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్జిటిలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి

14-09-2024 11:29:07 AM

సిద్దిపేట జిల్లా టిపిటిఎఫ్ డిమాండ్

సిద్దిపేట (విజయక్రాంతి): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కార్యాలయంలో నంగునూరు, నారాయణరావుపేట్, బెజ్జంకి మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి కనకయ్య, రాష్ట్ర సీనియర్ నాయకులు జి. తిరుపతిరెడ్డిలు హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేసే ఎస్. జి.టి ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాల్సిందిగా డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ప్రాథమిక ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేసి, బిఈడి అర్హత ఉన్న ఉపాధ్యాయులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు తరగతికి ఒక గది, తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేకపోవడం వల్లనే  ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగవుతున్నాయని చెప్పారు. 2018 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పిఆర్సిని వెంటనే అమలు చేయాలని, బకాయిలుగా ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, బకాయి పడ్డ ఐదు డిఏలను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు కాక పర్యవేక్షణ అధికారి పోస్టులు, జూనియర్, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు భర్తీకాకపోవడంతో విద్యారంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విజయేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి  తిరుపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నమల్ల రాములు, జిల్లా నాయకులు పద్మయ్య, నరసింహారెడ్డి, సత్యనారాయణ, మెహముద్, జనార్దన్ రెడ్డి, వివిధ మండలాల నాయకులు పరమేశ్వర్ రెడ్డి, ఆంజనేయులు, మనోహర్, ఎల్లం, సుధాకర్, జాకీర్ హుస్సేన్ మహేష్, హరికృష్ణ, తిరుపతి,  దర్శన్, నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.