calender_icon.png 29 October, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి

29-10-2024 01:56:48 AM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఎస్టీయూటీఎస్ టీచర్ సంఘం వినతి

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు ఓటు హక్కు కల్పించాలని ఎస్టీయూటీఎస్ టీచర్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం పర్వతరెడ్డి, సదానందంగౌడ్, పూర్వ అధ్యక్షుడు కత్తి నర్సింహారెడ్డి కోరారు. ఈమేరకు సోమవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని వారు కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రాథమిక, ప్రాథమికోన్న త పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్స్ టీచర్లకు ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే 80 శాతం మంది ఉపాధ్యా యులు ఉన్నత విద్యావంతులుగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు హక్కు లేకపోవడం అప్రజాస్వామికమని తెలిపారు.

1950లో చేసిన చట్టాన్ని సవరించి ఓటుహక్కును కల్పించాలని కిషన్‌రెడ్డికి వారు విజ్ఞప్తి చేశారు. న్యాయమైన సమస్య పరిష్కారానికి తప్పక కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు.