ఎస్జీటీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే దాదాపు 60 వేల మంది ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోవడం చాలా బాధాకరమని ఎస్జీటీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం తెలిపారు.
భవిష్యత్తులో వీరికి ఓటు హక్కు కల్పించేలా ఉపాధ్యాయుల పక్షాన, గ్రాడ్యుయేట్ల పక్షాన పోరాడేందుకు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సంకినేని మధుసూదన్ రావుకు టీచర్ సంఘాలన్నీ మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు.