రాజాపూర్,(విజయక్రాంతి): తిర్మలాపూర్ గ్రామంలో శుక్రవారం నుండి జరిగే ఎస్జీఎఫ్ మండలస్థాయి టౌర్నమెంట్ కి యువ రైతు కట్ట సంతోష్ కుమార్ రూ. 20,000 వేలు, పుల్లారెడ్డి రూ.5 వేలు, పంతులు మల్లయ్య రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించారు. మండల స్థాయి కబడ్డి, వాలీబాల్, ఖోఖో టోర్నమెంట్ నిర్వహణ కోసం చేయూత అందించిన దాతలకు ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపధ్యాయులు ప్రత్యేక ధ్యవాదములు తెలిపారు.