calender_icon.png 22 October, 2024 | 8:21 PM

ఘనంగా ప్రారంభమైన యస్.జి.ఎఫ్ అండర్ :19 పోటీలు

22-10-2024 06:01:11 PM

అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో ఘనంగా ప్రారంభమైన

యస్.జి.ఎఫ్ అండర్ 19 చెస్, వాలీబాల్, జూడో ,ఉషు పోటీలు

కరీంనగర్ (విజయక్రాంతి): స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో యస్.జి.ఎఫ్ అండర్ 19 చెస్, వాలీబాల్, జూడో మరియు ఉఘ పోటీల ప్రారంభోత్సవానికి యస్.జి.ఎఫ్ కార్యదర్శి మధు జాన్సన్ ముఖ్య అతిధిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు తప్పనిసరిగా క్రీడలలో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని తద్వారా విద్యలో రాణింవచ్చని చెప్పారు. క్రీడా రంగాన్ని ఎంపిక చేసుకున్న వారు ఉద్యోగాలను సైతం సులభంగా సాధించడమే కాకుండా ఇతరులకు ఆదర్శంగా నిలవడంలో సఫలీకృతమవుతారని చెప్పారు.

అదేవిధంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అన్ని రకాలుగా నిపుణులైన అనుభవజ్ఞులైన వ్యాయామ ఉపాధ్యాయ శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలలో నిర్వహింపబడే పోటీలకు ఎంపిక చేస్తున్నారని చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా క్రీడాకారులను వారు పరిచయం చేసుకొని శుభాభినందనలు తెలిపారు. ఈ పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి మరియు కరీంనగర్ ప్రాంతాలలోని క్రీడాకారులు విచ్చేసి వారి యొక్క అసమాన ప్రతిభను చాటారు. క్రీడల ద్వారా విద్యార్థులకు అనేక లాభాలు చేకూరుతాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి ఈ సందర్బంగా అన్నారు.

ఈ కార్యక్రమంలో పీడీలు సరిత, సుష్మ, రాజశేఖర్, చందు, నారాయణ, విష్ణు, జూడో అఫిషియల్స్ ఎల్వి రమణ, సి. మహేందర్, ఎం.శ్రీధర్, సాయిచందర్, సాయిరామ్ యాదవ్, శ్యామ్, యోగ అఫిషియల్స్ వి. కిష్ణయ్య, రామకృష్ణ, ఆనంద్ కిషోర్, స్వరూప చారి, ప్రవీణ్, ఉషు అఫిషియల్స్, విద్యాసాగర్, విక్రమ్, శ్రీనివాస్, వాలిబాల్ అఫిషియల్స్ శ్రీనివాస్, సతీష్, అశోక్, అనుల్రెడ్డి, చెస్ అఫిషియల్స్ అనూప్ కుమార్, సుజన్, కె. అరుణ్, ఆర్. రేవిక్, నితన్, పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.