calender_icon.png 29 April, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ ఐదవ రాష్ట్ర మహాసభలు

28-04-2025 12:22:14 AM

17 అంశాలపై తీర్మానాలు.. నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక 

ఖమ్మం, ఏప్రిల్ 27 విజయక్రాంతి : ఎస్‌ఎఫ్‌ఐ ఓ విశ్వవిద్యాలయం లాంటిదని... ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ్ అన్నారు. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం పునాదులపై ఇది నిర్మితమైందని తెలిపారు. ప్ర స్తుత కేంద్ర ప్రభుత్వం హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగుతోందని... సెక్యులరిజంపై మాట్లాడినందుకు స్కాలర్స్ ను యూనివర్సిటీల నుంచి బహిష్కరిస్తోందని చెప్పారు.

ఖ మ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం (సీతారాం ఏచూరి నగర్)లో మూడు రోజులు కొనసాగిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఐదవ మహాసభలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు సభలో భాగంగా నితీష్ నారాయణ్ ముఖ్యోపన్యాసం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ విశ్వవిద్యాలయం లాంటిది.. ఎలా జీవించాలో... ఎలాం టి వర్గ దృక్పథం కలిగి ఉండాలో.. నేర్పుతోందన్నారు. ధనిక, ఫ్యూడల్ భావజాలానికి వ్యతిరేకంగా శ్రమజీవుల పక్షాన ఈ సంఘం నిలబడుతుందన్నారు.

విద్యారంగాన్ని కాషాయీకరణ చేసే కుట్రలో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బా బు పిలుపునిచ్చారు.

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కోయ చంద్రమోహన్, ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, సో షల్ మీడియా రాష్ట్ర నాయకులు పిట్టల రవి, సీఐటీయూ నాయకులు కల్లూరు మల్లేష్, ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ నాయకులు నాగేశ్వరరావు తదితరులు సౌహార్థ సందేశాలిచ్చారు. మహాసభల్లో మొత్తం 17 తీర్మానాలను ఆమోదించారు. చివరగా రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు.