21-03-2025 01:09:32 AM
విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు.
ఖమ్మం, మార్చి 20 ( విజయక్రాంతి ):-భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర 5వ మహాసభలు ఏప్రిల్ 25, 26, 27 తేదీలలో ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు తెలిపారు.స్థానిక సుందరయ్య భవన్ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు పి.సుధాకర్, తుడుం ప్రవీణ్ లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా టి.నాగరాజు మాట్లాడుతూ 20ఏండ్ల తర్వాత ఖమ్మం నగరంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు జరుపు తున్నామని ఈ మహాసభలలో తెలంగాణ రాష్ట్ర విద్యారంగ సమస్యలు పరిష్కారానికి భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు,10 యూనివర్శీటీల నుండి ఎంపిక చేసిన 1000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు అని తెలిపారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీ భూములను కార్పోరేట్ శక్తులను అప్పజెప్పే చర్యలను వెనక్కి తీసుకొవాలని డిమాండ్ చేశారు.ఈ ప్రెస్ మీట్లో జిల్లా నాయకులు వినోద్, పూజిత, మనోజ్, త్రినాథ్, లోకేష్ ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.