calender_icon.png 21 September, 2024 | 6:00 AM

బడ్జెట్‌లో విద్యారంగానికి మొండి చెయ్యి.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన

26-07-2024 01:24:01 PM

మంచిర్యాల, విజయ క్రాంతి : బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందని జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్ వద్ద భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.3 శాతం ఇది గత ఓటాన్ బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ కంటే తక్కువ అని, గత బడ్జెట్లో విద్యారంగానికి రూ. 21,389 కోట్ల రూపాయలు కేటాయిస్తే, ప్రస్తుతం రూ. 21,292 కోట్లు కేటాయించారన్నారు.  ఈ నిధులతో ప్రస్తుతం ప్రభుత్వ విద్య ఏ మాత్రం అభివృద్ధి కాదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్లు ప్రతి మండలంలో తెలంగాణ మోడల్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పి దాని ఊసు ఈ బడ్జెట్లో లేదన్నారు. ప్రతి రెండు గ్రామాలకు ఒక గురుకులం, యూనివర్శిటీల అభివృద్ధి రాష్ట్రంలో 500 కోట్లతో ఎలా సాధ్యం అవుతుందనీ ప్రశ్నించారు. వీటిలో ఉస్మానియా, మహిళా యూనివర్సిటీ 200 కోట్లు పోనూ 300 కోట్లు పలహారం పంచినట్లు పంచారన్నరు. పాఠశాల విద్యారంగలో ఖాళీలు భర్తీ,మధ్యాహ్న భోజనం నిధులు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, నూతన భవనాలు, లైబ్రరీ, ముత్రశాలలు, మౌళిక సదుపాయాలు కోసం ఈ నిధులు సరిపోవని, గురుకులాలు నిర్మాణం కోసం కూడా కనీస నిధులు లేవన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదునూరి అభినవ్, నస్పూర్ మండల ఉపాధ్యక్షులు అరవింద్ రెడ్డి,జిల్లా టౌన్ సభ్యులు మానస,శ్రావణి, మమత, జెశ్వంత్,రవి తదితరులు పాల్గొన్నారు.