calender_icon.png 23 February, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు ప్రారంభం

18-02-2025 12:00:00 AM

మేడ్చల్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్ జిల్లా ఏడవ మహాసభలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రగతి నగర్ నుంచి సుందరయ్య భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే మహాసభలలో గతంలో చేసిన కార్యక్రమాలపై సమీక్ష, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించనున్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, ఉపాధ్యక్షుడు రజనీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కార్తీక్, ఆఫీస్ బేరర్స్ అవినాష్, అరుణ్, వంశీ, జిల్లా కమిటీ సభ్యులు భగత్, సుబ్బు, మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు .