25 ఏళ్ల తర్వాత నిర్వహణ
ఖమ్మం, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ఖమ్మంలో ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, నాగరాజు పేర్కొన్నారు. మహాసభలను పురష్కరించుకుని శుక్రవారం ఖమ్మం లోని యూటీఎఫ్ భవన్‌లో ఆహ్వాన సం ఘం ఆధ్వర్యంలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. మ హాసభలు తెలంగాణ విద్యారంగానికి, భవిష్యత్ పోరాటాలకు దిక్సూచిగా ఉంటాయని అన్నారు. మతోన్మాద విధానాలు, కేంద్రం ప్రభుత్వం తీసుకుంటున్న విద్యారంగ వ్యతిరేక చట్టాలు, అధిక ఫీజుల వసూళ్లపై సం ఘం ఉద్యమిస్తుందని చెప్పారు.
తెలంగాణ లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. 25 ఏళ్ల తర్వాత ఖమ్మంలో మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు.
సమావేశంలో ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ఐవీ రమణ, ఎం వీరారెడ్డి, కాంతారావు, గౌరవ సలహాదారు సుబ్బారావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షులు బెజవాడ సాయిశేషు, వంకాయల రాజు, జిల్లా నాయకులు రాగిణి, మనోజ్, త్రినాధ్, సింధు, శ్రావ్య, నిత్య, సింధు పాల్గొన్నారు.