calender_icon.png 8 February, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైగింక వేధింపులు.. యువతి బలవన్మరణం

08-02-2025 12:00:00 AM

కొత్తగూడెంలో విషాదఛాయలు

మిర్యాలగూడ, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి) : లైంగిక వేధింపులు తాళలేక ఉరేసుకొని యువతి బలవన్మరణానికి పా ల్పడింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో శుక్రవా రం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. కొత్తగూడెం గ్రామానికి చెందిన పల్ల వాణి (19) ఇంటర్ వరకు చదివి మిర్యాలగూడలోని ఓ కిరాణా షాపులో పనిచేస్తుంది.

అదే గ్రామా నికి చెందిన మద్దెల సతీష్ ఆమె ఫోన్‌కు అసభ్యకర సందేశాలు పంపి వేధిస్తుండ డంతో మనస్తాపానికి గురైంది. ఇటీవల వేధింపులు అధికం కావడంతో ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్నానాల గదిలో చీరతో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు సతీష్‌పై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ లోకేశ్ తెలిపారు. యువతి ఆత్మహత్యతో గ్రామంలో విషాదాన్ని నింపింది.