చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఘటన
చెన్నై, డిసెంబర్ 25: చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏండ్ల విద్యార్థిని లైంగి క వేధింపులకు గురైంది. గుర్తుతెలియని ఇద్ద రు వ్యక్తులు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డా రు. బాధితురాలి స్నేహితుడిని సైతం నిందితులు చితకబాదారు. సోమవారం ఈ ఘట న జరగగా బాధితురాలు మంగళవారం పో లీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ, అఖిల భారత మహి ళా సంక్షేమ సమాఖ్య ఆధ్యర్యంలో యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేశారు.
కాగా ఘటనకు సంబం ధించి జ్ఞానశేఖరన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. కాగా జ్ఞానశేఖరన్ యూనివర్సిటీ బయట ఫుట్‌పాత్‌పై బిర్యానీ అమ్ముతాడని తెలిసింది. తాను నేరం చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.
ఇతడికి ఇతర కే సులతో సంబంధాలున్నాయా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులు ఘటనకు సంబంధించి వీడియో ను చిత్రీకరించి బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణ కు పూర్తిస్థాయిలో సహకరిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రకాశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అ న్నామలై స్పందిస్తూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని మండిపడ్డారు. ఘటన జరిగిన స్థలంలో సీసీ కెమెరాలు పనిచేయక పోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.