19-02-2025 12:07:20 AM
కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా అద నపు కలెక్టర్ విక్టర్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని కళాభారతిలో ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
జిల్లాలోనే ప్రతిష్టాత్మ కంగా నిర్వహించబడుతున్న ఫోక్సో చట్టం పైన ప్రైవేట్ స్కూల్స్‌కి నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి పి. నాగరానీ, పొక్సో చట్టం, స్కూల్లో టీచర్ యొక్క బాధ్యతలను వివరిస్తూ, స్కూల్స్ లలో ఇటువంటి సంఘటనలు ఎదురైతే రిపోర్ట్ చేయాలని బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, కోర్టులలో ఫ్రెండ్లీ ప్రొసిజర్స్ ఫాలో అవడం జరుగుతుంది అని వివరించడం జరిగింది. చైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కి బ్యాడ్జెస్ ప్రధానం చేశారు.
జిల్లా అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్ గారు మాట్లాడుతూ తెలంగాణలో మొదటిసారిగా ప్రొటేక్షన్ ఆఫీసర్లను మన కామారెడ్డి జిల్లాలోనే నియమించడం జరిగిందని వారు పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
కార్యక్రమంలో చైల్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ యూనిసెఫ్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రతినిధి సోనీకుట్టి జార్జ్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఎ. ప్రమీల, జిల్లా బాలల సంరక్షణ అధికారి జె స్రవంతి, కామారెడ్డి చైల్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు స్వర్ణలత, జిల్లా బాల్య రక్ష భవన్ సిబ్బంది పాల్గొన్నారు.