calender_icon.png 23 December, 2024 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యుడి ప్రైవేటు పార్ట్స్ కోసిన నర్సు

13-09-2024 12:47:17 PM

సమస్తీపూర్: తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన వైద్యుడి జననాంగాలను కోసి పారేసిందో నర్సు. బీహార్ లోని సమస్తీ పూర్ జిల్లా హెల్త్ కేర్ సెంటర్ లో పని చేస్తున్న నర్సు రాత్రి విధులలో ఉండగా ఈ సంఘటన జరిగింది. డాక్టర్ అయిన సంజయ్ కుమార్, మరో ఇద్దరు సహాయకులతో కలిసి ఆమెపై లైంగిక దాడికి యత్నంచారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో పదునైన బ్లేడ్ తో డాక్టర్ తాలూకు ప్రైవేటు పార్టును కోసేసింది.  తదనంతరం పోలీసులకు ఫోన్ చేసి అక్కడినుంచి తప్పించుకుంది. మద్యం మత్తులో ఉన్న వైద్యుడు, ఇతర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రక్తపు మరకలు ఉన్న దుస్తులు, బ్లేడు, మద్యం సీసా తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.