calender_icon.png 3 April, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైంగికదాడి నిందితులను కఠినంగా శిక్షించాలి

02-04-2025 12:34:10 AM

పొన్నం బిక్షపతి గౌడ్

చిట్యాల, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ముదిరాజు కులానికి చెందిన యువతి పైన హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నం బిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సభ్య సమా జం తలదించుకునేలా జరుగుతున్న హత్యాచారాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిం చాలన్నారు.

ఏడుగురిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.అలాగే క్రిస్టియన్ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి హత్యగా అనుమానిస్తున్నామని, వెంటనే పోస్టుమార్టం రిపోర్ట్ ను బహిర్గతం చేయాలని కోరారు.మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని  హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ సంగీ రవి, జిల్లా ఇన్చార్జ్ వేల్పుగొండ మహేందర్, మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ తదితరులు పాల్గొన్నారు